Title | పలుకడేమే చెలి | palukaDEmE cheli |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | పలుకడేమే చెలి కలికి బోధన విని | palukaDEmE cheli kaliki bOdhana vini |
చరణం charaNam 1 | కలకాలము నీ యలుకలె యౌటను వలపు లనునవి తలపు లాయెగదె | kalakAlamu nI yalukale yauTanu valapu lanunavi talapu lAyegade |
చరణం charaNam 2 | వెన్నెల నా బిగి చన్నుల మోపుచు నున్నను నా మోము కన్నుల జూడడె | vennela nA bigi channula mOpuchu nunnanu nA mOmu kannula jUDaDe |
చరణం charaNam 3 | విరి బంతులు పై విసరిన గాంతుడు మరుని కేళి మాట మనమున దల్పడె | viri bantulu pai visarina gAntuDu maruni kELi mATa manamuna dalpaDe |
చరణం charaNam 4 | రమణిరో! భుజంగ రావు నుతిపయి తమి సుమ శయ్యను దార్పగ జూడడె | ramaNirO! bhujanga rAvu nutipayi tami suma Sayyanu dArpaga jUDaDe |