Title | బలె బలె నను | bale bale nanu |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | హిందుస్థానీ కాఫీ | hindusthAnI kAfI |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | బలె! బలె! నను జేరి బాసలు చేసి కలికిరో! నా మాట తలపడే రాడే | bale! bale! nanu jEri bAsalu chEsi kalikirO! nA mATa talapaDE rADE |
చరణం charaNam 1 | అత్తరు వేలనే అల గంద మేలనే పొత్తు మఱచి పోయి పురుషుడు రాడాయె చిత్తజు బారి నే జేరితినే చెలి | attaru vElanE ala ganda mElanE pottu ma~rachi pOyi purushuDu rADAye chittaju bAri nE jEritinE cheli |
చరణం charaNam 2 | సారెకు బయ్యెద జాఱ దీయుచు వాడు కూరిమి కౌగిటి గోరెడు వాడేడే మారు బారి నెటు నోరుతునే చెలి | sAreku bayyeda jA~ra dIyuchu vADu kUrimi kaugiTi gOreDu vADEDE mAru bAri neTu nOrutunE cheli |
చరణం charaNam 3 | సన్మానముల నెంతో సలుపుచున్న నాపై మన్మనోహరునకు మనసేమి రాకపోయె మన్మధు చేతలెటు మాన్పుదునే చెలి | sanmAnamula nentO salupuchunna nApai manmanOharunaku manasEmi rAkapOye manmadhu chEtaleTu mAn&pudunE cheli |
చరణం charaNam 4 | రంగనాధుడు కవి రాజ భుజంగ రావు మంగళ నుతుల నన్మఱచి రాకున్నాడే యంగజు ఢాకకు నాగుదునే చెలి | ranganAdhuDu kavi rAja bhujanga rAvu mangaLa nutula nanma~rachi rAkunnADE yangaju DhAkaku nAgudunE cheli |