Title | ఎంత కాంతమే | enta kAntamE |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | వసంత | vasanta |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఎంత కాంతమే వసంత ఋతు ||వెంత|| యింతిరో! యీ కనుల పండు వెపుడు జూడమే | enta kAntamE vasanta Rtu ||venta|| yintirO! yI kanula panDu vepuDu jUDamE |
చరణం charaNam 1 | కలువల దొర రేయి కాసె వెన్నెల చిలుకలు కోకిలలు చేసె రొదల | kaluvala dora rEyi kAse vennela chilukalu kOkilalu chEse rodala |
చరణం charaNam 2 | మల్లెలు చేమంతు లెల్ల కొల్ల లాయెనే చల్లని వాయువు వెదచల్ల సాగెనే | mallelu chEmantu lella kolla lAyenE challani vAyuvu vedachalla sAgenE |
చరణం charaNam 3 | ఝుమ్మనుచు వీను లెంతో సొగియు లీలలే దుమ్మెదలు పూవులెల్ల గ్రమ్మెనౌ బలే | jhummanuchu vInu lentO sogiyu lIlalE dummedalu pUvulella grammenau balE |
చరణం charaNam 4 | ఇంత వింత యౌట వాసంత కాలము కాంతుడౌ భుజంగ రాయ కవి నుతింపడే | inta vinta yauTa vAsanta kAlamu kAntuDau bhujanga rAya kavi nutinpaDE |