Title | రావటరా | rAvaTarA |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | హిందుస్థానీ కాఫీ | hindusthAnI kAfI |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రావటరా రాతిరి యింటికి | rAvaTarA rAtiri yinTiki |
చరణం charaNam 1 | భూ వలయమునను బూబోడులు లేరా యే వనిత కైన నీవిద్ది కలదా | bhU valayamunanu bUbODulu lErA yE vanita kaina nIviddi kaladA |
చరణం charaNam 2 | అవసర పడి నీపయి నాస చేసితి నని చవుకగా జూడగా నవునట రాయేరా | avasara paDi nIpayi nAsa chEsiti nani chavukagA jUDagA navunaTa rAyErA |
చరణం charaNam 3 | చలువ పన్నీటితో జలక మాడింతు నన్గలసి యీ వేళ నా కలవర ముడుపరా | chaluva pannITitO jalaka mADintu nan&galasi yI vELa nA kalavara muDuparA |
చరణం charaNam 4 | ఘనత భుజంగ రాయ కవి పోషకుడవని వినతుల జేసెద వేగ రారా యిక | ghanata bhujanga rAya kavi pOshakuDavani vinatula jEseda vEga rArA yika |