Title | రేపనెద వేమిరా | rEpaneda vEmirA |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | రేపనెద వేమిరా సామి నా లోపమేమో తెల్పరా | rEpaneda vEmirA sAmi nA lOpamEmO telparA |
చరణం charaNam 1 | ఈ పూటకైన నే మోపలేరా సామి రేపు మాపటికె పోపో దాని జేర | I pUTakaina nE mOpalErA sAmi rEpu mApaTike pOpO dAni jEra |
చరణం charaNam 2 | ఒక్క నాడుండిన మొక్క మొలచెదో యక్కడ నీకున్న మక్కువ తెలిసెలే | okka nADunDina mokka molachedO yakkaDa nIkunna makkuva teliselE |
చరణం charaNam 3 | పొందు కోరెద నీవా సుందరి గూడిన యంద మంటునని యాస జేసి యిక | pondu kOreda nIvA sundari gUDina yanda manTunani yAsa jEsi yika |
చరణం charaNam 4 | అందము కాదు గోవింద భుజంగ రావు వందనంబుల నందుకొను మిక | andamu kAdu gOvinda bhujanga rAvu vandanambula nandukonu mika |