Title | ఏమిరా మనోహరా | EmirA manOharA |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | హిందుస్థానీ తోడి | hindusthAnI tODi |
తాళం tALa | అద్దా | addA |
పల్లవి pallavi | ఏమిరా మనోహరా నాకేమి తోచదాయరా కాము బారి ద్రోచి నన్నే భామ గూడి నావురా | EmirA manOharA nAkEmi tOchadAyarA kAmu bAri drOchi nannE bhAma gUDi nAvurA |
చరణం charaNam 1 | పండు వెన్నెలలు వేసగి యెండలయి మండెరా బొండు మల్లె పాన్పు నిప్పుల గుండముగ నుండెరా | panDu vennelalu vEsagi yenDalayi manDerA bonDu malle pAn&pu nippula gunDamuga nunDerA |
చరణం charaNam 2 | నిన్ను గూడు వేడుక మును నన్నె యెఱుగ నైతిరా నిన్ను గాన లేక పిదప నన్న మెఱుగ నైతిరా | ninnu gUDu vEDuka munu nanne ye~ruga naitirA ninnu gAna lEka pidapa nanna me~ruga naitirA |
చరణం charaNam 3 | సుందరి బ్రతిమాలితి నీదు పొందు నాకు గూర్పరా యందమయిన యిరవు మనకు బొందు పఱచి నానురా | sundari bratimAliti nIdu pondu nAku gUrparA yandamayina yiravu manaku bondu pa~rachi nAnurA |
చరణం charaNam 4 | అల్లదె పూబందిటికి మెల్ల నన్ను జేర్పరా చల్లగా భుజంగ రావు సరసు బ్రోచు వల్లభా | allade pUbandiTiki mella nannu jErparA challagA bhujanga rAvu sarasu brOchu vallabhA |