Title | సరస కత్తెయని | sarasa katteyani |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | సరస కత్తెయని సకియ వలలో బడ సామి నేనేమందురా | sarasa katteyani sakiya valalO baDa sAmi nEnEmandurA |
చరణం charaNam 1 | విరి బంతులచే ముంచి విసము లోన నుంచి మురిపించి తేనెతో మోచేయి నాకించు | viri bantulachE munchi visamu lOna nunchi muripinchi tEnetO mOchEyi nAkinchu |
చరణం charaNam 2 | మందుల మారి యా మాయలాడి దాని పొందు పాయ వేమిరా యందఱి విన హరి యల్లరి వాడనె సుందరాంగి వలపు సూది మొన కొలుపు | mandula mAri yA mAyalADi dAni pondu pAya vEmirA yanda~ri vina hari yallari vADane sundarAngi valapu sUdi mona kolupu |
చరణం charaNam 3 | పాటలాధరికి నేపాటి ప్రేమ కలదొ మాటికి లంచమురా కూటమిక నీకు గూడదు చూడుమా రాట బెట్టి బల్పోరాటము నొనరించు | pATalAdhariki nEpATi prEma kalado mATiki lanchamurA kUTamika nIku gUDadu chUDumA rATa beTTi balpOrATamu nonarinchu |
చరణం charaNam 4 | మాటికి మాటికి నిన్ను మమత జూపుమన్న నేటికి దయ రాదురా మాటికి శ్రీ వెలయు మంత్రిప్రగడ రాజ కోటి భుజంగ రాయని బోటి గుణ మడుగు | mATiki mATiki ninnu mamata jUpumanna nETiki daya rAdurA mATiki SrI velayu mantripragaDa rAja kOTi bhujanga rAyani bOTi guNa maDugu |