Title | ఏమి సేతురా | Emi sEturA |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | అమీరు కల్యాణి | amIru kalyANi |
తాళం tALa | అద్దా | addA |
పల్లవి pallavi | ఏమి సేతురా నా మనోభవా | Emi sEturA nA manObhavA |
చరణం charaNam 1 | ఏమో కాని నిన్ను నే మఱుతునన్న నా మనము నందు నాటి యుంటివిరా | EmO kAni ninnu nE ma~rutunanna nA manamu nandu nATi yunTivirA |
చరణం charaNam 2 | మలయ సమీరము వడ గాలియై తోచె చలువల పన్నీరు చిలువల విసమయ్యె | malaya samIramu vaDa gAliyai tOche chaluvala pannIru chiluvala visamayye |
చరణం charaNam 3 | మారుని శరముల బారికి బాల్పడ గూరిచి నా విధి క్రూరత సూపెరా | mAruni Saramula bAriki bAlpaDa gUrichi nA vidhi krUrata sUperA |
చరణం charaNam 4 | మహిత భుజంగ మాన్య కవిపాలా మహిమ తెలిసెరా మాటలాడ రారా | mahita bhujanga mAnya kavipAlA mahima teliserA mATalADa rArA |