Title | సరసకు రావేమిరా | sarasaku rAvEmirA |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | కాఫీ | kAfI |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సరసకు రావేమిరా శ్రీకృష్ణ సరసకు రమ్మని నిరతము నిన్ను నే పరిపరి విధముల స్మరణ జేసిన గాని | sarasaku rAvEmirA SrIkRshNa sarasaku rammani niratamu ninnu nE paripari vidhamula smaraNa jEsina gAni |
చరణం charaNam 1 | మదన బాధలతో నే మది నిల్ప లేనురా నిదుర లేక నిను ఎదురు జూచితిరా మధురమైన నీ మృదువైన పలుకులు హృదయమందు నను బాధ జేసిన గాని | madana bAdhalatO nE madi nilpa lEnurA nidura lEka ninu eduru jUchitirA madhuramaina nI mRduvaina palukulu hRdayamandu nanu bAdha jEsina gAni |
చరణం charaNam 2 | శృంగారమైన నీ అంగ సంగమునకు ముంగురులను దూపి నిలచి యుంటినిరా మంగళ రూప నీ మోము జూపక ఆ రంగైన మేడలో రంజిల్లు కృష్ణ | SRngAramaina nI anga sangamunaku mungurulanu dUpi nilachi yunTinirA mangaLa rUpa nI mOmu jUpaka A rangaina mEDalO ranjillu kRshNa |