Title | కొమ్మా గాకిది | kommA gAkidi |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
తాళం tALa | త్రస్య గతి | trasya gati |
పల్లవి pallavi | కొమ్మా గాకిది మేలి బంగారు బొమ్మా యౌరరా యీ ముద్దు గుమ్మ సొగసు వర్ణింప నా తరమ్మా హా | kommA gAkidi mEli bangAru bommA yaurarA yI muddu gumma sogasu varNimpa nA tarammA hA |
చరణం charaNam 1 | చూపా పువ్విలు కాని క్రొవ్వాడి తూపా తమి ద్రుల్లెడు బేడిస చేపా దీని చూచి శక్యము ధైర్యమాప హా | chUpA puvvillu kAni krovvADi tUpA tami drulleDu bEDisa chEpA dIni chUchi Sakyamu dhairyamApa hA |
చరణం charaNam 2 | కరుణా మౌని మానసంబుల కైన మురులా తమ్మి ముసురు కొన్న భ్రమరులా కారా వేల్పులైన గింకరులా హా | karuNA mouni mAnasambula kaina murulA tammi musuru konna bhramarulA kArA vElpulaina ginkarulA hA |