Title | క్రొక్కారు మెరుగు | krokkAru merugu |
Written By | చెలివెందల గవిరంగ దాసు | chelivendala gaviranga dAsu |
Book | ||
రాగం rAga | వసంత | vasanta |
తాళం tALa | ఖండ గతి | khanDa gati |
పల్లవి pallavi | క్రొక్కారు మెరుగు లాగున దళుక్కున మెఱసి | krokkAru merugu lAguna daLukkuna me~rasi |
అనుపల్లవి anupallavi | యిక్కడ మరుగు పడడదేమొకా తమ్ముడా | yikkaDa marugu paDaDadEmokA tammuDA |
చరణం charaNam 1 | కెంబెదవి గఱచుకొని క్రీగంట జూపుగా లమ్మున న్నా మనస్సు లాగుకొన నెవ్వతో | kembedavi ga~rachukoni krIganTa jUpugA lammuna nnA manassu lAgukona nevvatO |
చరణం charaNam 2 | ఆపె వనలక్ష్మియో యారాజు కూతురో యీ పగిది నన్ను భ్రమయించి డాగెనెచటనో | Ape vanalakshmiyO yArAju kUturO yI pagidi nannu bhramayinchi DAgenechaTanO |
చరణం charaNam 3 | మళ్ళి రాడేమి నా మనసామె యెడ చిక్కి చెల్లరే యచ్చెలి చేకొనక తప్పదిక | maLLi rADEmi nA manasAme yeDa chikki chellarE yachcheli chEkonaka tappadika |