#565 ఇది నీకు మరియాదగా idi nIku mariyAdagA

Titleఇది నీకు మరియాదగాidi nIku mariyAdagA
Written Byధర్మపురి?dharmapuri?
Book
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఇది నీకు మరియాదగా ఏరా నా సామి
ఇది నీకు మరియాదగా
దానింటికి పోయి అలసి సొలసి గూడి
యిందున రావైతివి అయ్యయ్యో
idi nIku mariyAdagA ErA nA sAmi
idi nIku mariyAdagA
dAninTiki pOyi alasi solasi gUDi
yinduna rAvaitivi ayyayyO
1పట్టి మంచము బిగి పట్టించి
నా పడకింట పవళించమని వేడితే
నన్ను చట్ట చేయక నందు ఆ సవతి
గుడిసె కేగి పట్టిలో పవళించితివి అయ్యయ్యో
paTTi manchamu bigi paTTinchi
nA paDakinTa pavaLinchamani vEDitE
nannu chaTTa chEyaka nandu A savati
guDise kEgi paTTilO pavaLinchitivi ayyayyO
2గుత్తపు గుబ్బల గదియు కౌగిలించుచు
వద్దికగా ముద్దియ్య వేడితే
దిద్ది పోలిన పాత చిలికిన పాలించు కొత్తు నిపుడు
కౌగలించ వైతి వయ్యయ్యో
guttapu gubbala gadiyu kaugilinchuchu
vaddikagA muddiyya vEDitE
diddi pOlina pAta chilikina pAlinchu kottu nipuDu
kaugalincha vaiti vayyayyO
3ధరను వెలయు ధర్మపురి వేణుగోపాలా
మరుకేలిత మై మరువ గూడమని వేడ
సారె సారెకు నాతో చలము చేయుచు చాల
పర నారీ మణుల పొందను పో అయ్యయ్యో
dharanu velayu dharmapuri vENugOpAlA
marukElita mai maruva gUDamani vEDa
sAre sAreku nAtO chalamu chEyuchu chAla
para nArI maNula pondanu pO ayyayyO

One thought on “#565 ఇది నీకు మరియాదగా idi nIku mariyAdagA

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s