Title | ముందటివలె | mundaTivale |
Written By | ||
Book | ||
రాగం rAga | భైరవి | bhairavi |
తాళం tALa | త్రిపుట | tripuTa |
పల్లవి pallavi | ముందటి వలె నాపై నెనరున్నదా సామి ముచ్చటలిక ఏలరా | mundaTi vale nApai nenarunnadA sAmi muchchaTalika ElarA |
అనుపల్లవి anupallavi | ఎందుకీ మొగ మిచ్చకపు మాట లాడేవు యిది మేర గాదురా ఏరా నా సామి | endukI moga michchakapu mATa lADEvu yidi mEra gAdurA ErA nA sAmi |
చరణం charaNam 1 | పిలువ నంపిన రావు పిలచిన గైకొనవు పలుమారు వేడిన పలుకవు వలపు నిలుప లేక చెలువు డనుచు నిన్ను తలచి తలచి చాల తల్లడిల్లుటే కొని | piluva nampina rAvu pilachina gaikonavu palumAru vEDina palukavu valapu nilupa lEka cheluvu Danuchu ninnu talachi talachi chAla tallaDilluTE koni |
చరణం charaNam 2 | చిన్న నాటి నుండి చేరిన దెంచక నన్ను చౌక చేసేది న్యాయమా వన్నెకాడ నీదు వంచన లెరుగక నిన్నన బని లేదు నే జేయు పూజకు | chinna nATi nunDi chErina denchaka nannu chauka chEsEdi nyAyamA vannekADa nIdu vanchana lerugaka ninnana bani lEdu nE jEyu pUjaku |
చరణం charaNam 3 | కలువల రేడంచు కంచి వరదా నిన్ను లలనా యింత దూరము రానిచ్చేనా అలరు విల్తుని కేళిని నలుము కొనుచు నన్ను కలసిన పాపాన కాకన్నుల జూడ వచ్చితి ఓ | kaluvala rEDanchu kanchi varadA ninnu lalanA yinta dUramu rAnichchEnA alaru viltuni kELini nalumu konuchu nannu kalasina pApAna kAkannula jUDa vachchiti O |
చరణం charaNam 4 | కన్యను గద నేను కన్నెత్తి చూడవేరా వన్నెకాడ లేచి రారా వగలు చెందకురా | kanyanu gada nEnu kannetti chUDavErA vannekADa lEchi rArA vagalu chendakurA |