Title | రారా సుకుమార | rArA sukumAra |
Written By | ||
Book | ||
రాగం rAga | ||
తాళం tALa | ||
Previously Published at | 413 | |
పల్లవి pallavi | రారా సుకుమార ధీర రాజాధి రాజ లేరా పరిమళ మిదే గంధ మిదే పట్టి పూసేది రారా | rArA sukumAra dhIra rAjAdhi rAja lErA parimaLa midE gandha midE paTTi pUsEdi rArA |
చరణం charaNam 1 | లేదా నాపై ప్రేమా రాదా నాపై దయ సరసుడ లేచి రారా సమయ మిదే రారా | lEdA nApai prEmA rAdA nApai daya sarasuDa lEchi rArA samaya midE rArA |
చరణం charaNam 2 | వన్నెకాడ నిన్నె చాల నమ్మి యుంటీర మరీ సుందరాకారా నిన్నే చాలగ నమ్మితిరా | vannekADa ninne chAla nammi yunTIra marI sundarAkArA ninnE chAlaga nammitirA |
చరణం charaNam 3 | మల్లె పూల హారములు మెడ నిండ వేసెదరా జాస్మిన్ సెంటు యిదే జేటా జేటా జల్లెదరా | malle pUla hAramulu meDa ninDa vEsedarA jAsmin senTu yidE jETA jETA jalledarA |
చరణం charaNam 4 | పగ దానిగ నను పాటింపకు రావేమిరా సరసుడా రావేమిరా మోహనాకారా మోహమాయెరా మోహనాంగా నిను నమ్మితి గదరా మోహమాపా జాలను రావేమిరా | paga dAniga nanu pATimpaku rAvEmirA sarasuDA rAvEmirA mOhanAkArA mOhamAyerA mOhanAngA ninu nammiti gadarA mOhamApA jAlanu rAvEmirA |
చరణం charaNam 5 | విరు శరములు నాపై విపరీత మాయే మరులు కొంటిరా మోహనాకారా మరు కొల్పునకు సమయ మిదేరా రావేమిరా | viru Saramulu nApai viparIta mAyE marulu konTirA mOhanAkArA maru kolpunaku samaya midErA rAvEmirA |