Title | కాశికి పొయ్యెనే | kASiki poyyenE |
Written By | ||
Book | ||
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | చాపు | chApu |
Previously Posted At | 55 | |
పల్లవి pallavi | కాశికి పొయ్యెనే నీ వల్లనే ఓసోసి నామది నున్నయట్టి నీదు ఆశలెల్ల నిరాశ చేసుక ఇదో | kASiki poyyenE nI vallanE OsOsi nAmadi nunnayaTTi nIdu ASalella nirASa chEsuka idO |
చరణం charaNam 1 | ఏ తీరు నైనను ప్రీతి సేయుదువని పాతకి నే చాల భ్రమసి తిరుగుచుంటి రాతి మనసు గల నాతి నీవనుచు నే తెలియక మోసపోతి నయ్యయ్యో | E tIru nainanu prIti sEyuduvani pAtaki nE chAla bhramasi tiruguchunTi rAti manasu gala nAti nIvanuchu nE teliyaka mOsapOti nayyayyO |
చరణం charaNam 2 | చక్కగాను నాతో సంతోషముగ నీవు ఒక్క మాటాడితే తక్కువటేనకు ఇక్కడ భ్రాంతిచే ఇల్లాలిని బాసి దిక్కు దెసయు లేక తిరిగి తిరిగి రోసి | chakkagAnu nAtO santOshamuga nIvu okka mATADitE takkuvaTEnaku ikkaDa bhrAntichE illAlini bAsi dikku desayu lEka tirigi tirigi rOsi |
చరణం charaNam 3 | ముద్దుగుమ్మ మనమిద్దఱు గూడున్న ముద్దు నటేశ్వర మూర్తికే తెలుసును సుద్దు లెంచకున్న సుదతి నీ వనుచును సద్దు చేసిన ఆతో పలుకవు గనుక నే | muddugumma manamidda~ru gUDunna muddu naTESwara mUrtikE telusunu suddu lenchakunna sudati nI vanuchunu saddu chEsina AtO palukavu ganuka nE |