Title | రామ రామ ప్రాణసఖి | rAma rAma prANasakhi |
Written By | ||
Book | ||
రాగం rAga | ఆహిరి | Ahiri |
తాళం tALa | ఝంప | jhampa |
పల్లవి pallavi | రామ రామ ప్రాణ సఖి నెడబాసి రాము డెటువలె దాళెనో ముందు తామర సాక్షిని దలంచితే నా గుండె తల్లడంబందె నేమందు నయ్యయ్యో | rAma rAma prANa sakhi neDabAsi rAmu DeTuvale dALenO mundu tAmara sAkshini dalanchitE nA gunDe tallaDambande nEmandu nayyayyO |
చరణం charaNam 1 | కలికి చిలుక పలుకు లీలాగున నతనికి కర్ణ శూలములై యుండలేదో నెల రాయడతని పాలిటికి నీలాగున నిప్పుల కుప్పయై యుండలేదో | kaliki chiluka paluku lIlAguna nataniki karNa SUlamulai yunDalEdO nela rAyaDatani pAliTiki nIlAguna nippula kuppayai yunDalEdO |
చరణం charaNam 2 | తెలియకను రాతిరి పగలు నీ తీరునను దిగులు మదిలో దోచదాయ నేమో చెలియ నెడబాసి నప్పటి నుండి నా మనసు చిందర వందరై యున్న దయ్యాయ్యో | teliyakanu rAtiri pagalu nI tIrunanu digulu madilO dOchadAya nEmO cheliya neDabAsi nappaTi nunDi nA manasu chindara vandarai yunna dayyAyyO |
చరణం charaNam 3 | వరుడు పగవాడగుచు నీలాగు నాడల్ల మనుజేశు నలయించడాయె నేమో కెరలి యా గండ కోయిలు నాద మీలాగు ఖేదమై యతని బాధించలేదో | varuDu pagavADaguchu nIlAgu nADalla manujESu nalayinchaDAye nEmO kerali yA ganDa kOyilu nAda mIlAgu khEdamai yatani bAdhinchalEdO |
చరణం charaNam 4 | విరివిగా నాతని కాహార నిద్రాదులును విరసంబు గాక నింపాయనేమో విరిబోణి నెడబాసి నది మొదలు నేనిట్లు వెడవిల్తు బారి పాలైతి నయ్యయ్యో | virivigA nAtani kAhAra nidrAdulunu virasambu gAka nimpAyanEmO viribONi neDabAsi nadi modalu nEniTlu veDaviltu bAri pAlaiti nayyayyO |
చరణం charaNam 5 | వేమారు నావలెను దన సతికి నాతడును వేడగను నమ్మికలు నియ్యలే కామినీ మణి వద్ద లేనప్పు డతనికి కనుగవల నీరిట్టు గ్రమ్మ లేదో | vEmAru nAvalenu dana satiki nAtaDunu vEDaganu nammikalu niyyalE kAminI maNi vadda lEnappu Dataniki kanugavala nIriTTu gramma lEdO |
చరణం charaNam 6 | తామసపు ప్రేమ చేత నతడు నావలె గాక ధైర్యంబు దెచ్చుకొని యుండెనేమో కామించి నను మువ్వ గోపాల రమ్మనుచు కలసిన చెలి కనుల గప్పె నయ్యయ్యో | tAmasapu prEma chEta nataDu nAvale gAka dhairyambu dechchukoni yunDenEmO kAminchi nanu muvva gOpAla rammanuchu kalasina cheli kanula gappe nayyayyO |