Title | ఏమి సేతు యెటుల సైతు | Emi sEtu yeTula saitu |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | గుల్రోజ్ | gulrOj |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఏమి సేతు యెటుల సైతు సామి రాడాయే | Emi sEtu yeTula saitu sAmi rADAyE |
అనుపల్లవి anupallavi | కోమలాంగి వానికేమో కోపమాయెను | kOmalAngi vAnikEmO kOpamAyenu |
చరణం charaNam 1 | నిమిష మొక్క యుగము దోచె నీరజయానా సమయమిదే స్వామి రాక జాడ గానమే | nimisha mokka yugamu dOche nIrajayAnA samayamidE swAmi rAka jADa gAnamE |
చరణం charaNam 2 | మరుని వేధ కోర్వజాల మంద యానరో సరసుల కింతై నాపై జాలి లేదాయె | maruni vEdha kOrvajAla manda yAnarO sarasula kintai nApai jAli lEdAye |
చరణం charaNam 3 | నరసాపు ర్నివాసుడనియు నమ్మి యుంటి నేమర్పు రాని మరుబారి మప్పి బాసెనే | narasApu rnivAsuDaniyu nammi yunTi nEmarpu rAni marubAri mappi bAsenE |