Title | ఇచ్చెద నిచ్చెదనని | ichcheda nichchedanani |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | ఇచ్చెద నిచ్చెదనని యిన్ని దినములు జర్చి యిచ్చితి విక చాలు మెచ్చ వచ్చునురా | ichcheda nichchedanani yinni dinamulu jarchi yichchiti vika chAlu mechcha vachchunurA |
అనుపల్లవి anupallavi | మచ్చికల్ మగ నీ కన్నను చెడ్డ తెగువా యిచ్చితివిక రూక | machchikal maga nI kannanu cheDDa teguvA yichchitivika rUka |
చరణం charaNam 1 | నాలుగు దినముల నుండి నిదురయిన బోనీక పగలు రేయి యదిగా పనులెల్లా జర్పి యెల్లా వారిలో నను అల్లార పరచి యొక చెల్లాని రూక నా చేతి కియ్య వచ్చేవు | nAlugu dinamula nunDi nidurayina bOnIka pagalu rEyi yadigA panulellA jarpi yellA vArilO nanu allAra parachi yoka chellAni rUka nA chEti kiyya vachchEvu |
చరణం charaNam 2 | సరిసరి యిక చాలు పరులింటె బహు సిగ్గు దారీ జూచిక నీదు యూరికి పోరా తేరాగ వచ్చితె తెల్లవార్లును జర్పి ఇంకా మా వాడొకడు న్నాడను సామ్యముగా | sarisari yika chAlu parulinTe bahu siggu dArI jUchika nIdu yUriki pOrA tErAga vachchite tellavArlunu jarpi inkA mA vADokaDu nnADanu sAmyamugA |
చరణం charaNam 3 | వేషగాడ నరసాపుర వేణుగోపాల ఆశ బెట్టి రట్టు పరచి తెల్లవారులా మోసగించి యెన్నో ముచ్చటల్ సల్పి యొక సీపావు రూకా నా చెంగూన గట్టితి | vEshagADa narasApura vENugOpAla ASa beTTi raTTu parachi tellavArulA mOsaginchi yennO muchchaTal salpi yoka sIpAvu rUkA nA chengUna gaTTiti |