Title | రొక్కామిచ్చి | rokkAmichchi |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | మోహన | mOhana |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | రొక్కామిచ్చితె నీయక్కా మరియొక్కాతే నీవే శాశ్వతమటవె | rokkAmichchite nIyakkA mariyokkAtE nIvE SASvatamaTave |
అనుపల్లవి anupallavi | నిక్కూచు నీలిగేవు నింత సుక్కవ రక్కాసి వలె ముఖము ముదిబురించేవేమే | nikkUchu nIligEvu ninta sukkava rakkAsi vale mukhamu mudiburinchEvEmE |
చరణం charaNam 1 | నీ శిరసుపై నెగిరేటి చెలియా లెల్లా నన్ను రాతిరి వేళా రమ్మని బతిమాలుచు నాతి నా మెడ పుష్పా మాలికల్ ధరియించి చేతికి విడెమిచ్చి చెయి బట్టి వేడుచు | nI Sirasupai negirETi cheliyA lellA nannu rAtiri vELA rammani batimAluchu nAti nA meDa pushpA mAlikal dhariyinchi chEtiki viDemichchi cheyi baTTi vEDuchu |
చరణం charaNam 2 | చెలియారో నేనొస్తె చేరి మాటాడవు పలుకారించే దాకా తల యెత్తవు కాసులు మ్రోగితే కలకల నవ్వేవు వేశ్య కైన నీయట్టి టక్కులు దెలియవే | cheliyArO nEnoste chEri mATADavu palukArinchE dAkA tala yettavu kAsulu mrOgitE kalakala navvEvu vESya kaina nIyaTTi Takkulu deliyavE |
చరణం charaNam 3 | నిదుర బోవగ జూచి నిను గలసే దెరుగావు మదనుని కొంటే మోమృదువానవు కొదువేమి శ్రీ నరసాపుర వాసుడని దెలిసె పదరక నికమీద వదిగి యుండవె చెలి | nidura bOvaga jUchi ninu galasE derugAvu madanuni konTE mOmRduvAnavu koduvEmi SrI narasApura vAsuDani delise padaraka nikamIda vadigi yunDave cheli |