Title | చెలికాడ నినుబాసి | chelikADa ninubAsi |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | బేగడా | bEgaDA |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | చెలికాడ నినుబాసి బలవంతమున నత్త ఇలుజేరా నను బంపిరి నాసామి | chelikADa ninubAsi balavantamuna natta ilujErA nanu bampiri nAsAmi |
అనుపల్లవి anupallavi | కలనైనా యెడబాయా జాలని మనకిట్టి గతి గలిగె నేమందు నా సామి | kalanainA yeDabAyA jAlani manakiTTi gati galige nEmandu nA sAmi |
చరణం charaNam 1 | కాళ్ళాడకను చాలా కలవార పడి నేడు కదలీ పోవుచు నుంటిగా నాసామి | kALLADakanu chAlA kalavAra paDi nEDu kadalI pOvuchu nunTigA nAsAmi |
చరణం charaNam 2 | వలవల కన్నీరు వరదలై పారగ తల వ్రాసెనిటు దైవమూ నాసామి | valavala kannIru varadalai pAraga tala vrAseniTu daivamU nAsAmi |
చరణం charaNam 3 | ఎన్నాళ్ళ కొస్తునూ ఇల నరసాపుర వాసా నన్నూ నీ మదినుంచుము నాసామి | ennALLa kostunU ila narasApura vAsA nannU nI madinunchumu nAsAmi |