Title | నిమిషాము యుగమాయె | nimishAmu yugamAye |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | మధ్యమావతి | madhyamAvati |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | నిమిషాము యుగమాయె నిలువ శక్యము గాదు నీ వేగితివి కదవే | nimishAmu yugamAye niluva Sakyamu gAdu nI vEgitivi kadavE |
అనుపల్లవి anupallavi | తమకాముచే మది తహతహ లాయేను తడవు సేయక వేగమే నాసామి | tamakAmuchE madi tahataha lAyEnu taDavu sEyaka vEgamE nAsAmi |
చరణం charaNam 1 | పన్నుగ ప్రాణాము పాలించె దొరయా నా ప్రాణానాధుని దేగదే వేవేగామె | pannuga prANAmu pAlinche dorayA nA prANAnAdhuni dEgadE vEvEgAme |
చరణం charaNam 2 | తడవు సేసితే నాడు తనువు దారబోసి తరలే దానని దెల్పవే నాసామిని | taDavu sEsitE nADu tanuvu dArabOsi taralE dAnani delpavE nAsAmini |
చరణం charaNam 3 | పడతి బోధన విని పగబట్టి నిటుసేయ బాడిగాదని దెల్పవే నాసామిని | paDati bOdhana vini pagabaTTi niTusEya bADigAdani delpavE nAsAmini |
చరణం charaNam 4 | శ్రీ నరసాపుర వాసా శీఘ్రమే రమ్మాని చెయి బట్టి బతిమాలవే బీరాన | SrI narasApura vAsA SIghramE rammAni cheyi baTTi batimAlavE bIrAna |