Title | సారెసారెకు వాని | sAresAreku vAni |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | సారెసారెకు వాని చరితాముల్ నా ముందూ చెల్లాదు పొమ్మానవె | sAresAreku vAni charitAmul nA mundU chellAdu pommAnave |
అనుపల్లవి anupallavi | పోరు జేసి రాత్రి పోయి చేరిన పొలతి ఇల్లిది గాదనవె | pOru jEsi rAtri pOyi chErina polati illidi gAdanave |
చరణం charaNam 1 | ఎన్నాడైన వాని నెదిరించి నే చిన్నామెత్తు మాటన్నానటే వన్నెలాడి వలపులెన్ని దిట్టిన గాని వెన్న ముద్దులు గావటె | ennADaina vAni nedirinchi nE chinnAmettu mATannAnaTE vannelADi valapulenni diTTina gAni venna muddulu gAvaTe |
చరణం charaNam 2 | వాని రాకా జూడగనె నేనే భీతిని పడకటిల్లూ జేరుట లేదటే యేకమయిన ప్రొద్దు యడ లేని సౌఖ్యము లెల్లా జెప్పగ లేదటె వాదటె నాతో | vAni rAkA jUDagane nEnE bhItini paDakaTillU jEruTa lEdaTE yEkamayina proddu yaDa lEni saukhyamu lellA jeppaga lEdaTe vAdaTe nAtO |
చరణం charaNam 3 | గూటా చిలుక వలె కుదిరి నేనుండంగా కుటిలాము దలపోసే నే మాటా మాత్రమే పోయి మగనాలితో చేరె మంచిది యిక చూతునే | gUTA chiluka vale kudiri nEnunDangA kuTilAmu dalapOsE nE mATA mAtramE pOyi maganAlitO chEre manchidi yika chUtunE |
చరణం charaNam 4 | ఇల నరసాపుర వాసుడింతా జేసెనటంటే ఈ తీరుగాకుందునే సలలీతముగ వెంకటస్వామి వరదూని చాగి పోనీయకుందునే | ila narasApura vAsuDintA jEsenaTanTE I tIrugAkundunE salalItamuga venkaTaswAmi varadUni chAgi pOnIyakundunE |