Title | ఏడు నాళాయే | EDu nALAyE |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | ఏడు నాళాయే ఈ వేళాకు ననుబాసి | EDu nALAyE I vELAku nanubAsi |
అనుపల్లవి anupallavi | వేదూకగత్తెలు ఎందారయినారో | vEdUkagattelu endArayinArO |
చరణం charaNam 1 | ఏవేళ రతి మాన యెరుగావు ననుబాసి యీవేళ వరకు నీవట్టే యుంటివ సామీ | EvELa rati mAna yerugAvu nanubAsi yIvELa varaku nIvaTTE yunTiva sAmI |
చరణం charaNam 2 | చిన్ననాడె నాకా చిన్నెలన్నియు నేర్పి నీరీతి విడనాడుటిది న్యాయమగునే వన్నెకాడ నాతో వాదు చేసితె గాని వనితాలిండ్లకు బోవా వల్లగాదని యెంచి | chinnanADe nAkA chinnelanniyu nErpi nIrIti viDanADuTidi nyAyamagunE vannekADa nAtO vAdu chEsite gAni vanitAlinDlaku bOvA vallagAdani yenchi |
చరణం charaNam 3 | బొంకు లేటికి నీవు పోయినప్పటి నుండి మంకు పనులు జేయ మరిగితివి స్వామి జంకులెల్లా మాని యా జలజాక్షులను గూడి చెలగి యా పనులెల్లా చెల్లించుటకు బోయి | bonku lETiki nIvu pOyinappaTi nunDi manku panulu jEya marigitivi swAmi jankelellA mAni yA jalajAkshulanu gUDi chelagi yA panulellA chellinchuTaku bOyi |
చరణం charaNam 4 | మరచి యుండుదమంటె మర్లు మించుచునుండె మరుని బారిని నోర్వజాలరా సామీ వరదుడౌ శ్రీ నరసాపుర వేణుగోపాల అరమరలిక మాని ఆదారించవే సామి | marachi yunDudamanTe marlu minchuchununDe maruni bArini nOrvajAlarA sAmI varaduDau SrI narasApura vENugOpAla aramaralika mAni AdArinchavE sAmi |