Title | నమ్మరాదే | nammarAdE |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నమ్మరాదే మగవారినీ | nammarAdE magavArinI |
అనుపల్లవి anupallavi | ముమ్మాటికినీ మగజాతిని మది | mummATikinI magajAtini madi |
చరణం charaNam 1 | ఇమ్మహి సొగసగు కొమ్మలం జూచిన నమ్మకముగ మాది సమ్మతి పరతురు | immahi sogasagu kommalam jUchina nammakamuga mAdi sammati paraturu |
చరణం charaNam 2 | చిరుత వయస్సు గల చేడెల కెన్నడు ఎరుగని లీలలు ఏరపటు జేతురు | chiruta vayassu gala chEDela kennaDu erugani lIlalu ErapaTu jEturu |
చరణం charaNam 3 | సరసముచే మది నీరుగ జేతురు పరిపరి విధముల బాసలు జేతురు వరసలు గనుగొని వన్నెల జేతురు | sarasamuchE madi nIruga jEturu paripari vidhamula bAsalu jEturu varasalu ganugoni vannela jEturu |
చరణం charaNam 4 | వప్పకుంటె బహు త్రిప్పలు బడుదురు తప్పక వాళ్ళకు దండము లిడుదురు యిప్పటికీ మగజాతి కిదే జిత | vappakunTe bahu trippalu baDuduru tappaka vALLaku danDamu liDuduru yippaTikI magajAti kidE jita |
చరణం charaNam 5 | రంగు సింగు మచంగలు జూపుచు వంగుటు వాలుచు చెంగట జేరుచు దొంగ బాసలచే అంగనా మణులను భంగ పరచి మరి తొంగి చూడరట | rangu singu machangalu jUpuchu vanguTu vAluchu chengaTa jEruchu donga bAsalachE anganA maNulanu bhanga parachi mari tongi chUDaraTa |
చరణం charaNam 6 | పగతులయినను నమ్మవచ్చు మగజాతిని నమ్ముట తగదు తగదు శ్రీ నరసాపురి గోపాలుని సాక్షిగ | pagatulayinanu nammavachchu magajAtini nammuTa tagadu tagadu SrI narasApuri gOpAluni sAkshiga |