Title | ఆడవారిని | ADavArini |
Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | ఆడవారిని నంమరాదురా వగలాడి పలుకులాడు వారిని నంమరాదురా | ADavArini nam^marAdurA vagalADi palukulADu vArini nam^marAdurA |
అనుపల్లవి anupallavi | ఆడజాతిని నమ్మి పురుషులు జాడ తెలియని రోగములచే పీడ్తులై దుదముట్ట జాలక ఈడు ముదరకే మోసపోదురు | ADajAtini nammi purushulu jADa teliyani rOgamulachE pIDtulai dudamuTTa jAlaka IDu mudarakE mOsapOduru |
చరణం charaNam 1 | చేత సొమ్మున్నంత సేపేరా రాతీరి పగలని యెంచకను మరుకేళి దేలురా | chEta sommunannta sEpErA rAtIri pagalani yenchakanu marukELi dElurA |
చరణం charaNam 2 | సతతము నిను నమ్మితి నా పతికి మించిన ప్రాణ రక్షక బ్రతుక జాలను నిన్ను బాసితె వెతలు బుట్టకు నీవె దిక్కను | satatamu ninu nammiti nA patiki minchina prANa rakshaka bratuka jAlanu ninnu bAsite vetalu buTTaku nIve dikkanu |
చరణం charaNam 3 | నమ్మకముతో సొమ్ము దీసేరు తుదకు వారిని నంమ జాలక బైట దోచేరు దిమ్మ రానయి తిరుగ రాయని కుంమరింటికి బోయి క్రొత్త కుండ దెచ్చి చేతికిచ్చి చటుండ దగదని శాగ దోలేడు | nammakamutO sommu dIsEru tudaku vArini nam^ma jAlaka baiTa dOchEru dimma rAnayi tiruga rAyani kum^marinTiki bOyi krotta kunDa dechchi chEtikichchi chaTunDa dagadani SAga dOlEDu |
చరణం charaNam 4 | మాటలాళిక మళ్ళి పొమ్మననూ యికమీద నిచ్చట సొచ్చితివని పెండ్లి నిజమనునూ వెల్లరా నీ ముండ మొయ్యా యిల్లు చెడ్డది నిన్ను నుంచె అల్లరేలను నరసపురి శ్రీ వల్లభునితో జెప్పుకొంమను | mATalALika maLLi pommananU yikamIda nichchaTa sochchitivani penDli nijamanunU vellarA nI munDa moyyA yillu cheDDadi ninnu nunche allarElanu narasapuri SrI vallabhunitO jeppukom^manu |