Title | మరియాద తెలియకనే | mariyAda teliyakanE |
Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మరియాద తెలియకనే మాటలాడుట తగునటే | mariyAda teliyakanE mATalADuTa tagunaTE |
అనుపల్లవి anupallavi | పరిహాసము జేయతగిన వరుస కలిగి యుంటే నేమి | parihAsamu jEyatagina varusa kaligi yunTE nEmi |
చరణం charaNam 1 | సరస సల్లాపములకు సమయము గాదే యేమె సరసిజాక్షి నావంటి సతులు గుంపు గూడి యుండగ | sarasa sallApamulaku samayamu gAdE yEme sarasijAkshi nAvanTi satulu gumpu gUDi yunDaga |
చరణం charaNam 2 | వెలదిరో నన్ను గూడినట్లు వేంకటేశ్వరునిపై బలవంతముగా నేను వలచి వచ్చినానేమి | veladirO nannu gUDinaTlu vEnkaTESvarunipai balavantamugA nEnu valachi vachchinAnEmi |