Title | ఏరా తగునటరా | ErA tagunaTarA |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏరా తగునటరా – సరిగాదురా | ErA tagunaTarA – sarigAdurA |
అనుపల్లవి anupallavi | రారాపు సేయకురా – రాజ గంభీర | rArApu sEyakurA – rAja gambhIra |
చరణం charaNam 1 | పర సతులతో పరిహాసము లాడుచు మరి మరి నొప్పించెదవు ఎట్ల సైతురా | para satulatO parihAsamu lADuchu mari mari noppinchedavu eTla saiturA |
చరణం charaNam 2 | వర ధర్మపురమున స్థిరముగ నెలకొన్న వరదుడ మారుకేళిలో నన్ను గూడరా | vara dharmapuramuna sthiramuga nelakonna varaduDa mArukELilO nannu gUDarA |