Title | ఇది నీకు | idi nIku |
Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
Previously Posted At | 565 | |
రాగం rAga | బేగడ | bEgaDa |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | ఇది నీకు మరియాదగా ఏరా నా సామి | idi nIku mariyAdagA ErA nA sAmi |
అనుపల్లవి anupallavi | ఇది నీకు మరియాదగా దానింటికి పోయి అలసి సొలసి గూడి ఇందు రావైతి వయ్యో | idi nIku mariyAdagA dAninTiki pOyi alasi solasi gUDi indu rAvaiti vayyO |
చరణం charaNam 1 | పట్టె మంచము బిగి పట్టించి నా పడ కింట పవ్వళించమని వేడితే నాతో సద్దు సేయక మువ్వ సుదతి యింటికి పోయి వట్టి నేలలో పవ్వళించితి వయ్యో | paTTe manchamu bigi paTTinchi nA paDa kinTa pavvaLinchamani vEDitE nAtO saddu sEyaka muvva sudati yinTiki pOyi vaTTi nElalO pavvaLinchiti vayyO |