Title | కోపమెటుల | kOpameTula |
Written By | పట్టాభిరామయ్య?? | paTTAbhirAmayya?? |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 253 | |
పల్లవి pallavi | కోపమెటుల రాక యుండునురా కోమలాంగ నీపై | kOpameTula rAka yunDunurA kOmalAnga nIpai |
అనుపల్లవి anupallavi | పాపి యింటనే కాపురమై నీ రూపము కంటికి జూపక యుండిన | pApi yinTanE kApuramai nI rUpamu kanTiki jUpaka yunDina |
చరణం charaNam 1 | నిన్నటి రాత్రి నిన్నిటు రమ్మని విన్నప మిచ్చి మా కన్యను బంపితే చిన్ననాటి నా నేస్తము నెంచకా చిన్నది మెచ్చన నన్న మాటలు విన | ninnaTi rAtri ninniTu rammani vinnapa michchi mA kanyanu bampitE chinnanATi nA nEstamu nenchakA chinnadi mechchana nanna mATalu vina |
చరణం charaNam 2 | కాసుకు కాని యా దాసితోను పరిహాస మాడుచు నుల్లాసమై పయ్యెద దీసి తిన్నగ మూసి ముద్దిడు నీ సరసంబులు మోసము నేలిన | kAsuku kAni yA dAsitOnu parihAsa mADuchu nullAsamai payyeda dIsi tinnaga mUsi muddiDu nI sarasambulu mOsamu nElina |
చరణం charaNam 3 | వేమరు వేడిన నీ మనసంత యా రామపాల్ జేసి విరాముడై వేడ్కతో కాముకేళి యా లేమ గూడిన చామ భూపాల నే నీ మమతలు విన | vEmaru vEDina nI manasanta yA rAmapAl jEsi virAmuDai vEDkatO kAmukELi yA lEma gUDina chAma bhUpAla nE nI mamatalu vina |
Audio Link | https://www.youtube.com/watch?v=YVryeUtO9R8 |