Title | తారుమారు | tArumAru |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | నాటకురంజి | nATakuranji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | తారుమారు లాడేవేమే బజారి | tArumAru lADEvEmE bajAri |
అనుపల్లవి anupallavi | నేరమెంచకనే కౌగలించ మంటే | nEramenchakanE kaugalincha manTE |
చరణం charaNam 1 | అంబుజాక్షిరో నే సంబ్రముగ నీదు బింబాధర చుంబనంబు లివ్వమంటే | anbujAkshirO nE sambramuga nIdu bimbAdhara chumbanambu livvamanTE |
చరణం charaNam 2 | మోడి సేయక నాతోడ బల్కి కడు వేడుకన్ కర్పూర విడెమివ్వమంటే | mODi sEyaka nAtODa balki kaDu vEDukan karpUra viDemivvamanTE |
చరణం charaNam 3 | ప్రీతి మీరగనే సాదరంబుతో నీదు లేత గుబ్బల నాచేతి కివ్వమంటే | prIti mIraganE sAdarambutO nIdu lEta gubbala nAchEti kivvamanTE |
చరణం charaNam 4 | తాళలేనే బాలికామణి నీ తాళవనేశుని యేలుకోమంటే | tALalEnE bAlikAmaNi nI tALavanESuni yElukOmanTE |