Title | బలిమి ఏల | balimi Ela |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | బలిమి ఏల బాళామణి అలవానితో పలుమారు నీకు | balimi Ela bALAmaNi alavAnitO palumAru nIku |
చరణం charaNam 1 | వాని పిలిచి బల్కేటి హీనత లెల్లను అలివేణు లెరిగిన మన మానములు పోనే | vAni pilichi balkETi hInata lellanu alivENu lerigina mana mAnamulu pOnE |
చరణం charaNam 2 | ఏమోయని వేమరు నిన్నే నే మానితే నీవు మన నేమ మెరుగక అతి ప్రేమగా మా దొర వినుచు | EmOyani vEmaru ninnE nE mAnitE nIvu mana nEma merugaka ati prEmagA mA dora vinuchu |
చరణం charaNam 3 | తాళవన లోలుని ఏ వేళ తలచుచు వ్యాకుల పడనేల పలు వాలాయము గాను | tALavana lOluni E vELa talachuchu vyAkula paDanEla palu vAlAyamu gAnu |