Title | మోహమెల్ల | mOhamella |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | మోహన | mOhana |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మోహమెల్ల దెలిసెను గదరా! మోహనాంగ! వినర | mOhamella delisenu gadarA! mOhanAnga! vinara |
అనుపల్లవి anupallavi | దాహవంతుని సాటి నా గేహమున కేతెంచిన నీ | dAhavantuni sATi nA gEhamuna kEtenchina nI |
చరణం charaNam 1 | మదిలో వంచనలనే యెంచి వదనమున మాధుర్య ముంచి సుదతిపై నీ నెనరు నుంచి సదయుని తీరు నటించే నీ | madilO vanchanalanE yenchi vadanamuna mAdhurya munchi sudatipai nI nenaru nunchi sadayuni tIru naTinchE nI |
చరణం charaNam 2 | పరుపుపై నా కరము బట్టి మరువనని నా శిరము గొట్టి సరసమాడి పూలుబట్టి తరుణి నెంచి తత్తరించే నీ | parupupai nA karamu baTTi maruvanani nA Siramu goTTi sarasamADi pUlubaTTi taruNi nenchi tattarinchE nI |
చరణం charaNam 3 | తాలవలోల నన్ను లాలనతో నేలు వేళ చాల ప్రేమ తోను లేచి యా బాల నేల బోయిన నీ | tAlavalOla nannu lAlanatO nElu vELa chAla prEma tOnu lEchi yA bAla nEla bOyina nI |