Title | కలగన్నటు | kalagannaTu |
Written By | రామనాధపురం శ్రీనివాసయ్యంగార్ | rAmanAdhapuram SrInivAsayyamgAr |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | కేదార గౌళ | kEdAra gauLa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | కల గన్నటు లాయరా కామజనక | kala gannaTu lAyarA kAmajanaka |
అనుపల్లవి anupallavi | జల తీరమున నన్ను అలయించి వలపించి గులుకు గొప్పుననంటి పలుకరించు కొన్నది | jala tIramuna nannu alayinchi valapinchi guluku goppunananTi palukarinchu konnadi |
చరణం charaNam 1 | జలజాక్షి వేసమిడి చెలులతో కూడికొని ఇలుజొచ్చి కలకంఠి వలె పలుకుల నుంచి కలవారలను పలు కలలచే మెప్పించి పలుమారు నను యేచి మనసు దోచిన దెల్ల | jalajAkshi vEsamiDi chelulatO kUDikoni ilujochchi kalakanThi vale palukula nunchi kalavAralanu palu kalalachE meppinchi palumAru nanu yEchi manasu dOchina della |
చరణం charaNam 2 | నిను పాడమని చాల చనవున బల్కిన తన నాథుని యటు దాపున తొలగించి కనరాని వింతల కాలము గడిపించి నను పాడి పలుమారు మనసు దోచిన దెల్ల | ninu pADamani chAla chanavuna balkina tana nAthuni yaTu dApuna tolaginchi kanarAni vintala kAlamu gaDipinchi nanu pADi palumAru manasu dOchina della |
చరణం charaNam 3 | వేదాంతమున గల నాదాత్మకుడైన జగ న్నాధ గోప కన్యా వినోద జగన్మోహన కాదా నన్నేలనిక వాదా శ్రీనివాసుడు కాదా జాగు సేయకు రాధా రమణ పొందు | vEdAntamuna gala nAdAtmakuDaina jaga nnAdha gOpa kanyA vinOda jaganmOhana kAdA nannElanika vAdA SrInivAsuDu kAdA jAgu sEyaku rAdhA ramaNa pondu |