Title | ఇటు సాహసములు | iTu sAhasamulu |
Written By | స్వాతి తిరునాళ్ మహారాజా | svAti tirunAL mahArAjA |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | సైంధవి | saindhavi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇటు సాహసములు ఏల నాపై చక్కని సామి | iTu sAhasamulu Ela nApai chakkani sAmi |
అనుపల్లవి anupallavi | ఇట్లు వగలు తాళ నా తరమా | iTlu vagalu tALa nA taramA |
చరణం charaNam 1 | ఇక చిన్న దాన నేను మగవారిని ముఖము ఎరుగ నే యున్నాన వగ కాసారి నీకిది మేరగాదే వలపు న్యాయ మెరుగు నా సామి | ika chinna dAna nEnu magavArini mukhamu eruga nE yunnAna vaga kAsAri nIkidi mEragAdE valapu nyAya merugu nA sAmi |
చరణం charaNam 2 | మనసు రంజితమయ్యే నీకు తగిన మగువతో ఈ వగలుంచ వలను వినవయ్యా నాపలుకులు ఈ వేళను వింతలు చాలు నా సామి | manasu ranjitamayyE nIku tagina maguvatO I vagaluncha valanu vinavayyA nApalukulu I vELanu vintalu chAlu nA sAmi |
చరణం charaNam 3 | సరసిజ నేత్రుడ నీ కరుణ వల్ల చాల యవ్వనము వచ్చె నాడు మరుకేళి లోనే నిను లాలించుదును సరస పంకజ నాభ నా సామి | sarasija nEtruDa nI karuNa valla chAla yavvanamu vachche nADu marukELi lOnE ninu lAlinchudunu sarasa pankaja nAbha nA sAmi |