Title | ఏ కామిని | E kAmini |
Written By | బెంగుళూరు చంద్రశేఖర శాస్త్రి | benguLUru chandraSEkhara SAstri |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | నాటకురంజి | nATakuranji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏ కామిని బోధించెనో | E kAmini bOdhinchenO |
అనుపల్లవి anupallavi | ఏమి తెలియని నా సామి కిపుడు | Emi teliyani nA sAmi kipuDu |
చరణం charaNam 1 | పాటలాధరి యేపాటున నున్న నా మాట లెపుడు జవ దాటని వాని | pATalAdhari yEpATuna nunna nA mATa lepuDu java dATani vAni |
చరణం charaNam 2 | తోయజ ముఖీ నిన్ బాయగలనా యని రేయి బగలు నెడ బాయని వాని | tOyaja mukhI nin bAyagalanA yani rEyi bagalu neDa bAyani vAni |
చరణం charaNam 3 | ముందు నన్నేలి యానందము జెందిన సుందరుడౌ బాలచంద్ర నా సామి | mundu nannEli yAnandamu jendina sundaruDau bAlachandra nA sAmi |