Title | చలమేలర | chalamElara |
Written By | ?? | |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | నాటకురంజి | nATakuranji |
తాళం tALa | ఆది | Adi |
Previously Posted At | 396 | |
పల్లవి pallavi | చలమేలర నాపై జలజ నేత్రుడా పిలిచిన పలుకక | chalamElara nApai jalaja nEtruDA pilichina palukaka |
అనుపల్లవి anupallavi | కలకాలము నీ చెలిమి జేయ నే దలచి వలచి వచ్చియుంటి నంతట | kalakAlamu nI chelimi jEya nE dalachi valachi vachchiyunTi nantaTa |
చరణం charaNam 1 | నీ సరసములు నీటులు నీ సొగసు నీ చతురత నీ హొయలు నీ గుణములు నీ సరిసమ రసికుల నే నరసి జూడ దొరక లేక మరులు మించి మొరలిడ | nI sarasamulu nITulu nI sogasu nI chaturata nI hoyalu nI guNamulu nI sarisama rasikula nE narasi jUDa doraka lEka marulu minchi moraliDa |
చరణం charaNam 2 | సారసరిపుని కోరు చకోర గతి నిను నమ్ముచు సారెకును నీ మరుగున జేరదలచి చెలులతో మనసార నా విచారమెల్ల చెవియార దెల్పియు బ్రోవక | sArasaripuni kOru chakOra gati ninu nammuchu sArekunu nI maruguna jEradalachi chelulatO manasAra nA vichAramella cheviyAra delpiyu brOvaka |