Title | ఇద్దరి పొందేల | iddari pondEla |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఆది | Adi |
Previously Posted At | 331, 207 | |
పల్లవి pallavi | ఇద్దరి పొందేలరా స్వామి ఇక దానింటికే పోరా అల దానింటికే పోరా | iddari pondElarA svAmi ika dAninTikE pOrA ala dAninTikE pOrA |
అనుపల్లవి anupallavi | సద్దేల చేసేవు స్వామిక నేనోర్వ వద్దిక నీవు రావద్దురా వద్దురా | saddEla chEsEvu svAmika nEnOrva vaddika nIvu rAvaddurA vaddurA |
చరణం charaNam 1 | కన్నులు ఎరుపేమిరా చెక్కులు కాటుక నలుపేమిరా కన్నుల విలుకాని కయ్యాన మెలిగిన చిన్నెవై తోచెర చెప్పుర చెప్పుర | kannulu erupEmirA chekkulu kATuka nalupEmirA kannula vilukAni kayyAna meligina chinnevai tOchera cheppura cheppura |
చరణం charaNam 2 | నాజోలి నీకేలరా ఆ బ్రహ్మ నిన్నెట్టు పుట్టించెరా ఏ జాము దానింట నీ జాడ నే జూడ బేజారి బేజారి నేజెల్ల నేజెల్ల | nAjOli nIkElarA A brahma ninneTTu puTTincherA E jAmu dAninTa nI jADa nE jUDa bEjAri bEjAri nEjella nEjella |