Title | ఏమి మేము | Emi mEmu |
Written By | ||
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
తాళం tALa | ఆది (తిశ్రగతి) | Adi (tiSragati) |
పల్లవి pallavi | ఏమి మేము సానివారము కుంభిని పూర్ణ సోమలింగ తమకు న్యాయమా | Emi mEmu sAnivAramu kumbhini pUrNa sOmalinga tamaku nyAyamA |
అనుపల్లవి anupallavi | నా మనోహరుండు నేను కాముకేళి నుండువేళ కావరమున వచ్చి నన్ను కామినీ రమ్మని యెదవు | nA manOharunDu nEnu kAmukELi nunDuvELa kAvaramuna vachchi nannu kAminI rammani yedavu |
చరణం charaNam 1 | ఇంటి మగను వలెను వెంటను భయము లేక జంట బాయవేమి సేతురా కాని వాడు నా మగండు కత్తి చేతను మరువడిపుడు నీవు నేను పట్టుబడిన పూని హాని పరచునోయి | inTi maganu valenu venTanu bhayamu lEka janTa bAyavEmi sEturA kAni vADu nA maganDu katti chEtanu maruvaDipuDu nIvu nEnu paTTubaDina pUni hAni parachunOyi |
చరణం charaNam 2 | వెరువకా మా పెరటి లోపలా సన్నజాజుల విరుల తోట మరుగు నీడల మరుగు నుండి నన్ను బిలచి మరుని కేళి గూడినావు యిరుగు పొరుగు వారు జూచిన పరువు మరువు బోవు నోయి | veruvakA mA peraTi lOpalA sannajAjula virula tOTa marugu nIDala marugu nunDi nannu bilachi maruni kELi gUDinAvu yirugu porugu vAru jUchina paruvu maruvu bOvu nOyi |