Title | ఎంతని నినునే | entani ninunE |
Written By | గర్భపురి? | garbhapuri? |
Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | ఎంత నిను నే వేడుదురా సామి | enta ninu nE vEDudurA sAmi |
అనుపల్లవి anupallavi | ఎంతటికైన దయా రాదేమిరా నా దొర సామి | entaTikaina dayA rAdEmirA nA dora sAmi |
చరణం charaNam 1 | నిదుర కంటికి రాదురా నిన్నెడబాసి మదనుడు శరము వేయ మరువకున్న దొర | nidura kanTiki rAdurA ninneDabAsi madanuDu Saramu vEya maruvakunna dora |
చరణం charaNam 2 | చక్కని గుబ్బలు ఉప్పొంగిన విర గ్రక్కున చెక్కిలి నొక్కి కౌగిలించమని | chakkani gubbalu uppongina vira grakkuna chekkili nokki kaugilinchamani |
చరణం charaNam 3 | ఎందుకు జాలము సేయుదురా నీవు ముందు నను గూడిన శ్రీ గర్భపురీశా ధీరా | enduku jAlamu sEyudurA nIvu mundu nanu gUDina SrI garbhapurISA dhIrA |