Title | నేడేలరా యీ | nEDElarA yI |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | అఠాణా | aTHANA |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నేడేలరా యీ జాలము చాలురా రారా సామి | nEDElarA yI jAlamu chAlurA rArA sAmi |
చరణం charaNam 1 | ఈ లాగున బహు నాళ్ళుగ ప్రేమ లతా బధ్ధులమై రేయీ పగలూ రతి కేళిలో ఓల లాడుదము | I lAguna bahu nALLuga prEma latA badhdhulamai rEyI pagalU rati kELilO Ola lADudamu |
చరణం charaNam 2 | నిన్న మొదలుగ నొక వన్నెలాడి నిన్ను కను సన్నలచే బిలచి నట్లు విన్నానురా లేకున్నను | ninna modaluga noka vannelADi ninnu kanu sannalachE bilachi naTlu vinnAnurA lEkunnanu |
చరణం charaNam 3 | అందగత్తె యని మది యందు భ్రమ జెందకురా డెందము రాయిరా మచ్చు మందులమారి గదా | andagatte yani madi yandu bhrama jendakurA Dendamu rAyirA machchu mandulamAri gadA |
చరణం charaNam 4 | పాలు నీరు బోలి మనమేకమై యెట్లుందిమో ఆ లీలగా నుందాము శ్రీ లోలా సింహపురి పాలా | pAlu nIru bOli manamEkamai yeTlundimO A lIlagA nundAmu SrI lOlA sim^hapuri pAlA |