Title | ఇక నేమందు | ika nEmandu |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇక నేమందు చెలియా నా సామికి నామీద యేమో అలుకాయెనె | ika nEmandu cheliyA nA sAmiki nAmIda yEmO alukAyene |
చరణం charaNam 1 | ఏ మాయలాడి తనే మందిడెనో ప్రేమతో ముద్దులిడుటె మానుకున్నాడే నే మాటాడితే యేమో మాటాడాకున్నాడే | E mAyalADi tanE mandiDenO prEmatO mudduliDuTe mAnukunnADE nE mATADitE yEmO mATADAkunnADE |
చరణం charaNam 2 | దిట్టము తోడ నాదు పక్క పూపాన్పు జేర చేయి బట్టి పిలిచితే ముట్టవద్దనే ప్రేమతో బాలచంద్ర నాథుడు నన్నేలి యే నాతి బోధచే నీతి దప్పెనో | diTTamu tODa nAdu pakka pUpAn&pu jEra chEyi baTTi pilichitE muTTavaddanE prEmatO bAlachandra nAthuDu nannEli yE nAti bOdhachE nIti dappenO |