Title | అలసిపోతి | alasipOti |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | అలసిపోతి వయ్యొ సామి అంతే చాలు నేటి కిక కలయుటకు కాలము లేదా మరేమి | alasipOti vayyo sAmi antE chAlu nETi kika kalayuTaku kAlamu lEdA marEmi |
అనుపల్లవి anupallavi | కులము వారమై యుండగ కూడిక సతమై యుండగ తలపనేల సింహ నగర ధామ శ్రీ రంగధామ | kulamu vAramai yunDaga kUDika satamai yunDaga talapanEla sim^ha nagara dhAma SrI rangadhAma |
చరణం charaNam 1 | బలితపు చెమట సోనల తోడ వాడిన నెమ్మోము క్రొన్దమి తోడ వెలయు నిట్టూర్పు సెగల తోడ విరిసి విరియని కన్దొగల తోడ | balitapu chemaTa sOnala tODa vADina nemmOmu kron&dami tODa velayu niTTUrpu segala tODa virisi viriyani kan&dogala tODa |
చరణం charaNam 2 | వడకెడు నును నెమ్మేని తోడ తడబడు మాటల చవి తోడ అడలు నట్టి పెన్దొడల తోడ అసురు సురులతో నీ తోడు | vaDakeDu nunu nemmEni tODa taDabaDu mATala chavi tODa aDalu naTTi pen&doDala tODa asuru surulatO nI tODu |
చరణం charaNam 3 | కలిగిన దెల్ల నొక నాడు కడ జేసుకోగా మరునాడు కళలు జారిపోయె చూడు నిలుపుము సింహపురవర నేడు | kaligina della noka nADu kaDa jEsukOgA marunADu kaLalu jAripOye chUDu nilupumu sim^hapuravara nEDu |