Title | అకట మరుపాయె | akaTa marupAye |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | శహన | Sahana |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | అకట మరుపాయె నౌర అబ్బురమాయె అక్కర దెలసి రావైతి వదేమిర | akaTa marupAye naura abburamAye akkara delasi rAvaiti vadEmira |
చరణం charaNam 1 | పక్కబాసి పోవు వేళలో యెక్కడికి యని చెయి పట్టగ నిక్కముగ నిదె వత్తునని చని నిన్న ప్రొద్దుట నుండి కనబడవు | pakkabAsi pOvu vELalO yekkaDiki yani cheyi paTTaga nikkamuga nide vattunani chani ninna prodduTa nunDi kanabaDavu |
చరణం charaNam 2 | ఏడాది పండుగ నేడే యని యెంచి నీ జత ఆశించి అలంకరించితి జలకంబు లాడి చలువ ధరించితి కస్తూరి బొట్టు తీరుగ నొనరించితి | EDAdi panDuga nEDE yani yenchi nI jata ASinchi alankarinchiti jalakambu lADi chaluva dharinchiti kastUri boTTu tIruga nonarinchiti |
చరణం charaNam 3 | నాడు నాటికి వేడుకల్ బల్ పోడిమిగ చెలువుడ ఆడితివ ఆ వాడవాడల చెలుల నంపిన లేడు లేడని మరలి వచ్చిరి పడకటింట మంచి వాసన పన్నీటిని చిలికించితి | nADu nATiki vEDukal bal pODimiga cheluvuDa ADitiva A vADavADala chelula nampina lEDu lEDani marali vachchiri paDakaTinTa manchi vAsana pannITini chilikinchiti |
చరణం charaNam 4 | రంగైన పుప్పొడి ముగ్గుల అలరించితి పాన్పు పైన విడి పువ్వులు పరపించితి వడివడిగ తెల నాకు ముడుపులు ముడుపులుగ మడిపించితి | rangaina puppoDi muggula alarinchiti pAn&pu paina viDi puvvulu parapinchiti vaDivaDiga tela nAku muDupulu muDupuluga maDipinchiti |
చరణం charaNam 5 | నిడుపుగల యా పూసరులు గ్రుమ్మడి ముడువ పనిబడి నిడితిని సతి పతులు మరేనాటి కెడబాయక యుందురని బల్కినది | niDupugala yA pUsarulu grummaDi muDuva panibaDi niDitini sati patulu marEnATi keDabAyaka yundurani balkinadi |
చరణం charaNam 6 | సద్దు సేయక పోతివింక గానిమ్ము తడవు సేయక పోనీ పోనీ వచ్చితివి నీ పుణ్యమా రంగడ సూనశరు శర జాలములకే సొక్కిపోతి నరసింహపుర | saddu sEyaka pOtivinka gAnimmu taDavu sEyaka pOnI pOnI vachchitivi nI puNyamA rangaDa sUnaSaru Sara jAlamulakE sokkipOti narasim^hapura |