Title | ఇది మేలా | idi mElA |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | అఠాణా | aTHANA |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇది మేలా నీకిది మేలా సరసుడ మది భేదమెంచక తెలుపర సుకుమార మనోహర | idi mElA nIkidi mElA sarasuDa madi bhEdamenchaka telupara sukumAra manOhara |
చరణం charaNam 1 | తళుకారు ముద్దు చెక్కుల నే నెలవంక గోరులుంతునా పలుగంటు సేయ కమ్మగా పయిపయిన ముద్దులుంతునా | taLukAru muddu chekkula nE nelavanka gOruluntunA paluganTu sEya kammagA payipayina mudduluntunA |
చరణం charaNam 2 | తరి రామ మోవి తేనియల్ దగ తీర గ్రోలి కందు నా చెలువారు మోవి మోవితో నెలకొల్పి యూరకొండునా | tari rAma mOvi tEniyal daga tIra grOli kandu nA cheluvAru mOvi mOvitO nelakolpi yUrakonDunA |
చరణం charaNam 3 | అనువొంద నీ యురముపై మొనగుబ్బ పోతులుంతునా నును మేను నాదు కౌగిటిని గూర్చి యదుము కొందునా | anuvonda nI yuramupai monagubba pOtuluntunA nunu mEnu nAdu kaugiTini gUrchi yadumu kondunA |
చరణం charaNam 4 | ఉపమాన రహితమైన యా యుపరతి సుఖమ్ము కందునా కృప గల్గు సింహ పురవరా రంగేశ సమరతి నుందునా | upamAna rahitamaina yA yuparati sukhammu kandunA kRpa galgu sim^ha puravarA rangESa samarati nundunA |