Title | దారి జూచు | dAri jUchu |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | దారి జూచుచుంటిరా నీదు ప్రేమ కోరి వేచి యుంటిర | dAri jUchuchunTirA nIdu prEma kOri vEchi yunTira |
అనుపల్లవి anupallavi | అలరు విల్తుడు శర జాలము లెద కేయ నిలువ జాలక తల వాకిట నిలచి నే | alaru viltuDu Sara jAlamu leda kEya niluva jAlaka tala vAkiTa nilachi nE |
చరణం charaNam 1 | మల్లెలు మొల్లలు మంచి విరజాజులు మెల్లగ తెప్పించి మాలలు గూర్చి నే | mallelu mollalu manchi virajAjulu mellaga teppinchi mAlalu gUrchi nE |
చరణం charaNam 2 | వెన్నెల రేయిది మల్లె పూపాన్పున కళలంటి సొక్కింతువని యెంచి | vennela rEyidi malle pUpAn&puna kaLalanTi sokkintuvani yenchi |
చరణం charaNam 3 | ఉద్యాన వనమున ఉల్లాసముగ నేడు ఉపరతి సమరతి తేలింప గలవని | udyAna vanamuna ullAsamuga nEDu uparati samarati tElimpa galavani |