Title | సరసుడ నీకిది | sarasuDa nIkidi |
Written By | ||
Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
రాగం rAga | అఠాణా | aTHANA |
తాళం tALa | తిశ్ర ఆది | tiSra Adi |
పల్లవి pallavi | సరసుడ నీకిది మేర సమయము మంచిది రారా | sarasuDa nIkidi mEra samayamu manchidi rArA |
చరణం charaNam 1 | రేయి పగలు నీదు రూపము కనుల కద్దు కొన వలెనని నిరతము జూచు చుంటిని నిజముగ ప్రియ సఖ | rEyi pagalu nIdu rUpamu kanula kaddu kona valenani niratamu jUchu chunTini nijamuga priya sakha |
చరణం charaNam 2 | నీ కొరకునై నాదు మేనిపై నాస విడిచి నీదు మోము గాంచుటెన్నడో యని మురియు చుంటి | nI korakunai nAdu mEnipai nAsa viDichi nIdu mOmu gAnchuTennaDO yani muriyu chunTi |
చరణం charaNam 3 | నా బటువైన గుబ్బలపై నీదు గోరు లుంతువని ఎంతో యాస తోడ యెదురు చూపులు చూచుచుంటి | nA baTuvaina gubbalapai nIdu gOru luntuvani entO yAsa tODa yeduru chUpulu chUchuchunTi |
చరణం charaNam 4 | నీదు చల్లని చూపులు నాపై ప్రసరింప జేయుటకై నీదు పాద సరోజములకు మ్రొక్కు లిడుచుంటి నా ప్రియ | nIdu challani chUpulu nApai prasarimpa jEyuTakai nIdu pAda sarOjamulaku mrokku liDuchunTi nA priya |