Title | మందు పెట్టేవంటి | mandu peTTEvanTi |
Written By | దేవుడయ్య | dEvuDayya |
Book | జావళి రవళి | jAvaLi ravaLi |
రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మందు పెట్టేవంటి ఇందు వదనరా ముందాలోచించరా ముందు వెనకాలోచించకుంటె నీవు మంద మతి యగురా | mandu peTTEvanTi indu vadanarA mundAlOchincharA mundu venakAlOchinchakunTe nIvu manda mati yagurA |
చరణం charaNam 1 | కన్ను సైగ జేసి నిన్నాకర్షించి కన్నులకు కాటుక వేసేదిరా కన్ను మూసి దానింటికి వెళ్ళితె కన్న వారె తిట్టెదరురా | kannu saiga jEsi ninnAkarshinchi kannulaku kATuka vEsEdirA kannu mUsi dAninTiki veLLite kanna vAre tiTTedarurA |
చరణం charaNam 2 | చన్నుల జూపించి నిను మెప్పించి సున్నము నీకు పెట్టేనురా విన్నలేని వారందరికి ఇంక అన్యాయము ఖచ్చితమురా | channula jUpinchi ninu meppinchi sunnamu nIku peTTEnurA vinnalEni vArandariki inka anyAyamu khachchitamurA |
చరణం charaNam 3 | ఆడదాని మాట వేదాంతపు తేటలని భావించకురా తోడు నీడుగ వచ్చే ఇల్లాలే మంచి దేవుడు ఇచ్చిన వరమురా | ADadAni mATa vEdAntapu tETalani bhAvinchakurA tODu nIDuga vachchE illAlE manchi dEvuDu ichchina varamurA |