Title | సారమైన | sAramaina |
Written By | స్వాతి తిరునాళ్ | svAti tirunAL |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | బిహాగ్ | bihAg |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Published At | 713 | |
పల్లవి pallavi | సారమైన మాటలంత చాలు చాలురా సామి | sAramaina mATalanta chAlu chAlurA sAmi |
అనుపల్లవి anupallavi | సారసాక్ష మీకెంతో సంతోషము మేలు మేలు | sArasAksha mIkentO santOshamu mElu mElu |
చరణం charaNam 1 | సోము డుదయ మాయెనే మీ సుదతికి మహా భయ మాయెనే కామ కోటి సుందరా మా భాగ్య మిటు లాయెనే | sOmu Dudaya mAyenE mI sudatiki mahA bhaya mAyenE kAma kOTi sundarA mA bhAgya miTu lAyenE |
చరణం charaNam 2 | మరునాథుని శర భంగము గావోదూ నీకు మాయందు దయ కానరాద విరహమైన వారధిలో మునికాయుందానన్నతో | marunAthuni Sara bhangamu gAvOdU nIku mAyandu daya kAnarAda virahamaina vAradhilO munikAyundAnannatO |
చరణం charaNam 3 | మనవి వినర సామి నిన్ను నమ్మియున్నాను మరేమి ఘనుడైన శేషునిపై వెలయు శ్రీ పద్మనాభ | manavi vinara sAmi ninnu nammiyunnAnu marEmi ghanuDaina SEshunipai velayu SrI padmanAbha |