Title | ఇంత మోడి | inta mODi |
Written By | స్వాతి తిరునాళ్ | svAti tirunAL |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | కాంభోజి | kAmbhOji |
తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
పల్లవి pallavi | ఇంత మోడి యాలర నా సామి నన్నేలుకోర వేగమే | inta mODi yAlara nA sAmi nannElukOra vEgamE |
అనుపల్లవి anupallavi | పంతమా నాపై శ్రీ పద్మనాభ సామి | pantamA nApai SrI padmanAbha sAmi |
చరణం charaNam 1 | అలిగి యుండుటకు అయ్యో ఏమి కారణ మయ్యలూ నా మీదరా తలిరుబోణులు నీకేమి బోధించిరో తాళరాదు విరహ మీవేళ సామి | aligi yunDuTaku ayyO Emi kAraNa mayyalU nA mIdarA talirubONulu nIkEmi bOdhinchirO tALarAdu viraha mIvELa sAmi |
చరణం charaNam 2 | క్షణము యుగ మాయెనే నాపై నీకు కరుణ లేక పోయెనే పణతు లందరు నన్ను జూచి నవ్వేరు ప్రాణ నాథుడ నిన్నే నమ్మినాను | kshaNamu yuga mAyenE nApai nIku karuNa lEka pOyenE paNatu landaru nannu jUchi navvEru prANa nAthuDa ninnE namminAnu |
చరణం charaNam 3 | సోము డనల మాయెనే నీతో గూడి సురత సుఖము లేని కాముని కన్న చక్కని పద్మనాభ కౌగిలించి కలయరా నాసామి | sOmu Danala mAyenE nItO gUDi surata sukhamu lEni kAmuni kanna chakkani padmanAbha kaugilinchi kalayarA nAsAmi |