Title | వలపు తాళ | valapu tALa |
Written By | స్వాతి తిరునాళ్ | svAti tirunAL |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | అఠాణ | aTHANa |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | వలపు తాళ వశమా నా సామికి చలము సేయ న్యాయమా | valapu tALa vaSamA nA sAmiki chalamu sEya nyAyamA |
అనుపల్లవి anupallavi | అలరు విల్తుని సమానుడౌ శ్రీ పద్మనాభుడు నెలత ఇపుడు నిన్ను నిరాకరించెనే | alaru viltuni samAnuDau SrI padmanAbhuDu nelata ipuDu ninnu nirAkarinchenE |
చరణం charaNam 1 | చిరుత ప్రాయము నాడే చిగురు బోణి వాని కరుణా సాగరుడని కలికి చాల నమ్మితి మరుని బాణము చాత మగువ నా మనసెంతో పరవశ మాయెనే భాగ్య మిటు లాయెనే | chiruta prAyamu nADE chiguru bONi vAni karuNA sAgaruDani kaliki chAla nammiti maruni bANamu chAta maguva nA manasentO paravaSa mAyenE bhAgya miTu lAyenE |
చరణం charaNam 2 | ఇలను నా ప్రాణేశు డే మానినితో గూడి జలజాక్షి మితి మీరి సరసా లాడు చున్నాడో పలుమారు నను జూచి పలుకు లాడిన దెల్ల తెలియ వచ్చెనే ఓ చెలియరో ఈ వేళ | ilanu nA prANESu DE mAninitO gUDi jalajAkshi miti mIri sarasA lADu chunnADO palumAru nanu jUchi paluku lADina della teliya vachchenE O cheliyarO I vELa |
చరణం charaNam 3 | సోమ కిరణము చాత సొగసైన నిన్నటి రేయి రామ రామ నాకు రమణి యుగ మాయెనే కామకేళిలో నన్ను కలసి యుండిన విభుడు నా మీద నున్న నెనరు నాతి మరచె నేమో | sOma kiraNamu chAta sogasaina ninnaTi rEyi rAma rAma nAku ramaNi yuga mAyenE kAmakELilO nannu kalasi yunDina vibhuDu nA mIda nunna nenaru nAti marache nEmO |